హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?

0
959

హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

కాగా కొండా సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలంచింది. అయితే అంతిమంగా సురేఖ పేరును పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన బీసి నేతలు బరిలో ఉండడంతో అధిష్టానం సురేఖ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.