ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా కరోనా ఎవరికైతే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందో అలాంటి వారిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి తగినంత రోగనిరోధకశక్తి లేకపోతే నిరసించి పోతాము. అదేవిధంగా తరచూ అంటు వ్యాధులకు గురి కావలసి వస్తుంది. ఈ క్రమంలోనే వ్యాధితో పోరాడే శక్తి మన శరీరంలో లేనప్పుడు ఎన్నో రకాల జబ్బులతో పాటు కరోనా వైరస్ కూడా మనల్ని వెంటాడుతుంది. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని తెలిపే లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

అధిక ఒత్తిడి: మన శరీరములో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉందని గుర్తించడానికి కనుగొనే మొదటి లక్షణం అధిక ఒత్తిడి. చాలా రోజుల నుంచి మీరు అధిక ఒత్తిడికి గురవుతున్న ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కచ్చితంగా మీ శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అంచనా వేయాలి.
తరచూ జబ్బులు బారిన పడటం: మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోతే వ్యాధికారక బ్యాక్టీరియాలను, వైరస్లను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి ఉండదు. ఈ క్రమంలోనే బ్యాక్టీరియా వైరస్ల పై దాడి చేయడానికి సరైన మోతాదులో యాంటీబాడీలను ఉత్పత్తి చేయలేదు కనుక ప్రతి చిన్న విషయానికి మనం జబ్బుల బారిన పడాల్సి వస్తుంది.ఈ విధంగా తరచూ జబ్బుల బారిన పడుతూ ఉంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అంచనా వేసుకోవాలి.
అలసట: ఎంతో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్న, రాత్రి సమయంలో తనివితీరా నిద్ర పోయినా, పగలంతా ఎలాంటి కష్టతరమైన పనులు చేయకున్నా కూడా తరచూ అలసటగా ఫీలవుతుంటారు. ఈ విధంగా అలసటగా ఫీల్ అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం.
గాయం లేటుగా మానవడం:కొందరికి ఏదైనా చిన్న గాయాలు తగిలిన గాయం అనేది చాలా ఆలస్యంగా నయమవుతుంది. మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోతే కొత్త చర్మ కణాలు ఉత్పత్తి చేయలేదు. ఈ విధమైనటువంటి లక్షణాలు తప్పకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం.































