Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముంబైలో పుట్టి పెరిగిన కాజల్ లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇక 2020లో వివాహం చేసుకున్న కాజల్ ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడంతో సినిమాలకు కొంతకాలం దూరం అయింది.

ప్రస్తుతం మళ్లీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇటీవల ‘ రైజింగ్ ఇండియా’ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో కాజల్ అగర్వాల్ కూడా పాల్గొనింది. ఈ సందర్భంగా ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కాజల్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్ మధ్య ఎలాంటి తేడా ఉంటుంది అనే ప్రశ్నకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

సౌత్ నార్త్ సినిమా ఇండస్ట్రీల మధ్య తేడా గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హిందీలో నటించాలని ఆశపడతారు. ఎందుకంటె అది అందరికీ తెలిసిన భాష. ఇక దక్షిణాది చిత్రపరిశ్రమలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో కూడా ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీతో పోల్చితే సౌత్ ఇండస్ట్రీలో విలువలు, క్రమశిక్షణతో పాటు న్యాయం కూడా ఉంటుంది. కానీ బాలివుడ్ లో మాత్రం అవి పెద్దగా ఉండవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Kajal Aggarwal: సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసలు…
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కాజల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా గుర్తింపు పొంది ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ కాజల్ మాత్రం తన మాతృభాషకు చెందిన ఇండస్ట్రీ గురించి కాకుండా సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని చెప్పటంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.