కరోనా నుంచి కోలుకున్న కంగనా.. ఇక కాంట్రోవర్సీలే?

0
62

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ ద్వారా వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతుంటారు.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్నడడంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కరోనా బారిన పడుతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా రంగంలో ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి ఎంతో మంది మరణిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా కరోనా బారిన పడినట్టు మే 8న తెలియజేశారు. ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకున్న కంగన తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగిటివ్ వచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా కంగనా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. ”నేను ఇంట్లోనే ఉండి కరోనా నుంచి ఎలా కోలుకున్నానో రాయాలని ఉంది. కానీ కరోనాను తక్కువ చేసి మాట్లాడితే కొందరు బాధపడతారు” అంటూ పోస్ట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొంతకాలం నుంచి తన చేస్తున్నటువంటి ట్వీట్స్ ఎంతో వివాదాస్పదంగా ఉండడంతో ట్విట్టర్ ట్వీట్స్ ను బ్లాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గతంలో కూడా కరోనా వైరస్ ని ఉద్దేశించి అది కేవలం చిన్న ఫ్లూ అని ట్వీట్ చేయడంతో ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈమె చేసే ట్వీట్స్ ట్విట్టర్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన ట్విట్టర్ టీమ్ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగనా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here