Karate Kalyani: నటి కరాటే కళ్యాణి పై మా సస్పెన్షన్ వేటు… సభ్యత్వం రద్దు చేయడానికి ఇదే కారణమా?

0
22

Karate Kalyani: నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె సినిమాలలో కన్నా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఫేమస్ అయ్యారు. తాజాగా నటి కరాటే కళ్యాణి పై మా సస్పెన్షన్ వేటు వేసింది. మా అసోసియేషన్ లో ఈమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ షాక్ ఇచ్చింది.

ఈ విధంగా నటి కరాటే కళ్యాణి సభ్యత్వం రద్దు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ విగ్రహ ఏర్పాటు పై కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ కారణంగానే ఈమెపై మా సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తుంది.

నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కృష్ణుని రూపంలో ప్రతిష్టిస్తున్న తరుణంలో ఈమె ఎన్టీఆర్ ఏ వర్గానికి దేవుడు అంటూ తీవ్ర వ్యతిరేకత చూపించారు. ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదంటూ యాదవ సంఘాలతో కలిసి ధర్నాలు చేశారు.ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమైనటువంటి నందమూరి తారక రామారావు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఈమె పై సస్పెన్షన్ వేటు పడిందని తెలుస్తోంది.

Karate Kalyani: ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే కారణమా…

ఈ క్రమంలోనే జనరల్ సెక్రటరీ వై.రఘుబాబు గురువారం కరాటే కళ్యాణీకి సస్పెన్షన్ నోటీసు పంపించారు. ఈనెల 16 జారీ చేసిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని తెలిపారు. మా
సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని సస్పెన్షన్ నోటీసులో పేర్కొన్నారు. మరి ఈ విషయంపై కరాటే కళ్యాణి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.