అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన మహేశ్ బాబు కూతురు సితార.. ప్రశంసలు కురిపిస్తూ నెటిజన్లు!

0
35

సితార.. ఈ పేరు అంటే చాలామందికి తెలియకపోవచ్చు.. కానీ ప్రిన్స్ మహేశ్ బాబు, నమ్రత కూతురు అంటే చాలామందికి తెలుస్తుంది. ఆమె చిన్న తనంలోనే ఆట పాటలతో, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సితారా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియలో ఓ వీడియో పోస్టు చేశారు. అది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఆమె ఓ వెస్టర్న్ పాటకు డ్యాన్స్ వేసిన వీడియోలను పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు వావ్ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెతుత్తున్నారు. ఫాస్ట్ బీట్‌తో వస్తున్న ఆ పాటకు సితారా అదిరిపోయే డ్యాన్స్ వేశారు. ”సోలోగా ట్రై చేశా.. ఇంకోటి చేయమంటారా.. అంటూ ట్యాగ్ చేశారు. మంచి డ్యాన్స్ పర్ ఫామెన్స్ చూపించడంతో అప్ కమింగ్ హీరోయిన్ సితారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంతే కాకుండా మరి కొంత మంది సినిమాల్లోకి వస్తే మాత్రం.. మహేశ్ బాబును మించిపోయేలా ఉందికదా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా గ్రేట్ టాలెంట్, ఫ్యూచర్‌ సూపర్‌స్టార్‌ అంటూ మెసేజ్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట మహర్షి సినిమాలోని పాలపిట్ట పాటకు డ్యాన్స్‌ చేసి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకున్న సితార.. మళ్లీ ఆమెపై ప్రశంసలు జల్లు కురిసింది.

చిన్నతనం నుంచే యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి సితారా.. పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఇలా ఆమెకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఇక త్వరలోనే సితారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనేది టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here