Mahesh Babu: మహేష్ బాబు ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

0
36

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాల నటుడిగా సుమారు పది సినిమాలకు పైగా నటించినటువంటి ఈయన అనంతరం హీరోగా మారిపోయారు ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు కేవలం టాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలు ఏవి కూడా పాన్ ఇయర్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఇక హీరోగా మహేష్ బాబు ఇప్పటివరకు 27 సినిమాలు చేశారు. తన 28వ సినిమా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నేడు మహేష్ బాబు తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక నేడు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇప్పటివరకు సినిమాలలో నటిస్తూ యాడ్స్ చేస్తూ సంపాదించినటువంటి ఆస్తులు ఎంత అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆయన ఆస్తులను ఏమాత్రం తీసుకోలేదని తెలుస్తుంది. కృష్ణ తన ఆస్తులు అన్నింటిని కూడా తన మనవడు మనవరాలు పేరిట రాశారట.

Mahesh Babu: వేల కోట్లు సంపాదించిన మహేష్…


ఈయన నమ్రతను వివాహం చేసుకోవడంతో నమ్రతనుంచి సుమారు 2000 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కలిసి వచ్చాయని తెలుస్తుంది. ఇక పలు సినిమాలలో నటిస్తూ మహేష్ బాబు సుమారు 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు ఒక యాడ్ వీడియో చేస్తే 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఏడాదికి సుమారు 200 కోట్లకు పైగా ఈయన ఆదాయం ఉందని తెలుస్తుంది.ఈ విధంగా మహేష్ బాబు సినిమాలలో కొనసాగుతూనే సుమారు 13 వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం.