Malashree: సినిమా ఇండస్ట్రీలోకి వారసులు వారసురాలు రావడం సర్వసాధారణం ఇప్పటికే ఎంతో మంది సీనియర్ నటీనటుల పిల్లలు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మరొక సీనియర్ నటి మాల శ్రీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు రాథనా రామ్.

దివంగత నటుడు రాము, సీనియర్ నటి మాలాశ్రీ దంపతుల కుమార్తెగా ఈమె ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తో కలిసి వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నారు. D56 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తరుణ్ సుధీర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాలాశ్రీ మాట్లాడుతూ తన కూతురికి చిన్నప్పటినుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉండటం వల్ల ముంబైలో ఇప్పటికే నటనలో డాన్స్ లో శిక్షణ తీసుకుందని తను నా కూతురిగా కాకుండా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తనపై మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Malashree: చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి…
ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమా నిర్మాతలు, రాక్‌లైన్ ప్రొడక్షన్ బ్యానర్ గురించి మాట్లాడుతూ నా సినిమాతోనే ఈ ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించారు. అలాంటిది ఈ బ్యానర్ లో నా కూతురు వెండితెరకు ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలలో తెరకెక్కుతుందని త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం జరుపుకుంటుందని వెల్లడించారు.































