Manchu Manoj: మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే వ్యక్తిగత విషయాల వల్ల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అంతే కాకుండా సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా మనోజ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

ఇటీవల మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడంతో అప్పటినుండి తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ చేసిన ఒక మంచి పని వల్ల వార్తల్లో నిలిచాడు. ఇక తాజాగా మనోజ్ తన పుట్టిన రోజును జరుపుకొన్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈ ఏడాది తన పుట్టిన రోజుని చాలా సింపుల్ గా ఒక అనాధ ఆశ్రమంలో జరుపుకున్నాడు.హైదరాబాద్‌లోని గాజులరామారం ‘కేర్ అండ్ లవ్’ అనాథ ఆశ్రమంలో అక్కడి చిన్నారులతో కలిసి మనోజ్ తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు.
మనోజ్ అక్కడ పిల్లలతో సరదాగా మాట్లాడి వారి బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరి సమక్షంలో కేక్ కట్ చేసాడు. ఆ తర్వాత వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్స్, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ…ఇలా తన బర్త్‌డేను చిన్నారుల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంచు మనోజ్ తెలిపారు. ‘పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపాడు.

Manchu Manoj: పిల్లలకు మరింత సేవ చేస్తాను…
భవిష్యత్తులో పిల్లలకు మరిన్ని సేవలు అందిస్తానని..వారి కళ్లలో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మనోజ్ ఇలా అనాధ పిల్లలతో మీరు ఆడంబరంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడంతో అందరూ మనోజ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
Rocking Star @HeroManoj1 celebrated his birthday at Care and Love orphanage, GajulaRamaram with the little superheroes! 🎂🎈
The smiles and laughter shared were pure magic. 💖#HBDManojManchu #RockingStarManoj #ManojManchu pic.twitter.com/Rxac98ZomL
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 20, 2023