Connect with us

Featured

Nagashaurya: అనుష్క గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు నాగశౌర్య… అలా చేయండి ప్లీజ్ అంటూ?

Published

on

Nagashaurya: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది లేదన్న విషయం మాత్రం అందరికీ సందేహంగానే ఉంటుంది. అయితే ఈ వార్తలపై సదరు సెలెబ్రెటీలు స్పందిస్తే తప్ప అవి నిజం అని మాత్రం తెలియదు. ఇలాంటి రూమర్స్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా నాగశౌర్యకు సంబంధించినటువంటి ఓ వార్త వైరల్ గా మారింది. మరి ఈ వ్యాఖ్యలు నాగశౌర్య నిజంగానే అన్నారా లేక ఇవి కూడా కల్పితాలేనా అన్న విషయం తెలియదు కానీ అనుష్క గురించి నాగశౌర్య చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగశౌర్య తనకు నటి అనుష్క శెట్టితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాయమని వేడుకున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అసలు నాగశౌర్య ఇలా ఎందుకు వేడుకున్నారనే విషయానికి వస్తే తనకు పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అందుకే ఈ వార్తలను ఖండిస్తూ ఆయన నేనే చెబుతున్నాను నాకు అనుష్క శెట్టి ఎఫైర్ ఉందని వార్తలు రాయండి అంటూ వేడుకున్నారని తెలుస్తోంది.

Nagashaurya: అనూష సెట్టింగ్ పెళ్లి చేసుకున్న నాగశౌర్య…

ఈ విధంగా నాగ శౌర్య అనుష్క శెట్టి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితేతన గురించి వచ్చిన ఆ వార్తలన్నీ కూడా ఆవాస్తవమేనని ఈయన చెప్పకనే చెప్పేశారు. ఇక ఈయన అనుష్క శెట్టి నీ పెళ్లి చేసుకోలేకపోయినా అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇక వీరి వివాహం ఏడాది మొదట్లో ఎంతో ఘనంగా జరిగింది.

Advertisement

Featured

Prabhas: ప్రభాస్ తో సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమైన ప్రొడ్యూసర్.. చరణ్ ఆదుకుంటారా?

Published

on

Prabhas: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హిట్ ఫ్లాప్ లు రావడం సర్వసాధారణం. ఎంత స్టార్ హీరో అయినా కూడా వారి కెరియర్ లో ఫ్లాప్ సినిమాలు అనేవి ఉంటాయి. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ సైతం తన కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను చవిచూశారు. ఇక ప్రభాస్ తో సినిమా చేసి ఓ ప్రొడ్యూసర్ ఏకంగా ఇండస్ట్రీ నుంచి కూడా దూరమయ్యారని తెలుస్తోంది.

Advertisement

ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ దర్శకత్వంలో నటించిన చిత్రం బుజ్జిగాడు ఈ సినిమాకి ఆదిత్య రామ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టాక్ పరంగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ కూడా పరవాలేదు అనిపించింది దీనితో మరోసారి పూరి జగన్నాథ్ ఆదిత్య రామ్ ప్రభాస్ కాంబినేషన్లో ఏక్ నిరంజన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత పూర్తిగా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఈ సినిమాకు నష్టాలు రావడంతో ప్రొడ్యూసర్ ఆదిత్య రామ్ ఏకంగా సినిమా ఇండస్ట్రీని వదిలి రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి వెళ్లిపోయారు. అలా అప్పుడు ఇండస్ట్రీకి దూరమైన ఆదిత్య రామ్ తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఏక్ నిరంజన్.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్  సినిమా తమిళ థియేటర్ హక్కులను ఈయన కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్య రామ్ మాట్లాడుతూ నన్ను మీరు గుర్తుపట్టకపోవచ్చు ఏక్ నిరంజన్ సినిమా ద్వారా నష్టాలు ఎదుర్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి వెళ్లిపోయాను. చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చానని ఈ సినిమా మంచి సక్సెస్ అయితే తాను మరిన్ని సినిమాలు చేస్తానని తెలిపారు. ప్రభాస్ వళ్ళ ఇండస్ట్రీని వదిలిపోయిన ఆదిత్య రామ్ చరణ్ వల్ల తిరిగి ఇండస్ట్రీలో నిలబడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Allu Arjun: నంద్యాల కేసులో అల్లు అర్జున్ కు భారీ ఊరట.. కేసు కొట్టి వేస్తూ తీర్పు!

Published

on

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కోర్టులో భారీ ఊరట లభించింది. ఈయన ఏపీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిని కలవడం కోసం నంద్యాల వెళ్లారు అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈయన ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తన స్నేహితుడిని కలిశారు అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే విషయం తెలిసే పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అల్లు అర్జున్ రావడంతో నంద్యాల పోలీసులు తన స్నేహితుడు శిల్ప రవితో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఇలా అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసుల కేసు నమోదు చేయడంతో ఆ కేసు కొట్టివేయాలని ఇటీవల అల్లు అర్జున్ కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ క్రమంలోనే నేడు ఆయన పిటిషన్ పట్ల విచారణ జరిపిన కోర్టు ఆయన కేసును కొట్టివేస్తూ తీర్పుని ఇవ్వడంతో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. నంద్యాల ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడికి మద్దతుగా అక్కడికి వెళ్లారు ఆయన ఎలాంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదు.

కేసు కొట్టివేత..
తన స్నేహితుడిని కలవడం కోసం వెళ్లడంతో ఆ విషయం తెలిసిన అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడం పట్ల పోలీసులు ఈయన పై కేసును నమోదు చేశారు. తాజాగా ఈ కేసును కొట్టి వేయడంతో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా వచ్చే నెల ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Niharika: నిహారికకు గట్టి షాక్ ఇచ్చిన మాజీ మొగుడు వెంకటచైతన్య?

Published

on

Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగబాబు కుమార్తెగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరియర్ మొదట్లో బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక తన మాట తీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Advertisement

ఇలా బుల్లితెర యాంకర్ గా సక్సెస్ అయిన ఈమె అనంతరం ఒక మనసు చిత్రం ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే నిహారిక నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా ఈమె నటించిన సినిమాలకు మంచి ఆదరణ లేకపోవడంతో నిహారిక కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమెకు పెద్దలు ఎంతో ఘనంగా వివాహం చేశారు. జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లైన రెండు సంవత్సరాలకి వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత నిహారిక తిరిగే ఇండస్ట్రీలో కొనసాగుతూ నటిగా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు.

నిహారిక స్నేహితురాలు..
ఇకపోతే తాజాగా నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక వెంకట చైతన్య రెండో వివాహం చేసుకోబోయేది మరెవరినో కాదు స్వయంగా నిహారిక స్నేహితురాలిని కావటం విశేషం. ఇలా నిహారిక స్నేహితురాలితో ఈయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!