Nayanathara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార గురించి అందరికీ సుపరిచితమే. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న నయనతార గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ అని సినిమా విడుదల అయ్యింది.

ఈ సినిమాకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ జంట పలు దైవ దర్శనాలు చేస్తూ హంగామా చేస్తున్నారు.ఇప్పటికే తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట తాజాగా శిరిడీ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇకపోతే గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న నయనతార విగ్నేష్ శివన్ రహస్యంగా నిశ్చితార్థం జరుపుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ జంట అమ్మవారి దర్శనానికి వెళ్లిన సమయంలో నయనతార నుదుటిపై బొట్టు పెట్టుకుని కనిపించారు. దీంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి.
శ్రీవారి సన్నిధిలో…
ఈ విషయం గురించి నయనతార స్పందించకపోయినా పెద్దఎత్తున ఈ వార్తలు హల్ చల్ చేశాయి. ఇకపోతే తాజాగా నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి ముహూర్తానికి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.అయితే వీరి వివాహాన్ని కేరళలో ఒక చర్చిలో జరుపుకుంటారని గతంలో వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం వీరు తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ శివన్ తో కలసి తిరుమలకి వెళ్లినట్టు సమాచారం.

































