కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని అభిమానులు తన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు అన్న మాటలు నమ్మలేకపోతున్నారు. గత నెల అక్టోబర్ 29న ఉదయం జిమ్ చేస్తూ గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే. పునీత్ రాజ్కుమార్ మరణవార్త విని ఒక్కసారిగా అతని అభిమానులు, సభ్యులు షాక్ కు గురయ్యారు.

కొంతమంది అభిమానులు తమ అభిమాన హీరో పోయాడు అన్న మరణ వార్త విని ఒక అభిమాని గుండె ఆగిపోయింది. ఇక అతన్ని చివరిగా చూసేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఇప్పటికే ఆయన సమాధిని చూడడానికి ప్రజలు వస్తూనే ఉన్నారు. ఇలా ఉంటే పునీత్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో పునీత్ కు సంబంధించిన ఒక అందమైన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెయింటింగ్ పునీత్ రాజ్ కుమార్ స్వర్గంలో ఉన్న తన తండ్రిని వెనకనుంచి కళ్ళు మూసి పట్టుకున్నట్టుగా ఈ పెయింటింగ్ ఇది ఒక్క హృదయాలను హత్తుకుంటోంది. ఎవరొచ్చారో చెప్పుకోండి అన్నట్టుగా తన తండ్రిని పునీత్ అడుగుతున్నట్లు గా కనిపిస్తోంది.
???????????? pic.twitter.com/YX7Dxu7IM0
— karan acharya (@karanacharya7) November 5, 2021
ప్రముఖ చిత్రకారుడు కరణ్ ఆచార్య రూపొందించిన ఈ పెయింటింగ్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ పెయింటింగ్ చూసిన అభిమానులు హార్ట్ టచింగ్.. వి మిస్ యు పునీత్ సార్.. మాటలు రావడం లేదు కన్నీళ్లు వస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.వాటే క్రియేటివిటీ,అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు.
































