Rahul Ramakrishns: అతనితో పోలిస్తే తనని అవమానించినట్లే… వైరల్ అవుతున్న నటుడు రాహుల్ రామకృష్ణ పోస్ట్!

0
51

Rahul Ramakrishns: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అర్జున్ రెడ్డి భరత్ అనే నేను త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా కమెడియన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన ఇంటింటి రామాయణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇది కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో కొందరు నటుడు ప్రియదర్శిని నటించిన బలగం సినిమాతో పోలుస్తూ ఈ సినిమా పట్ల ప్రశంసలు కురిపించారు.ఈ విధంగా బలగం సినిమాతో తన ఇంటింటి రామాయణం సినిమాని పోల్చి కామెంట్ చేయడంతో ఈ కామెంట్లపై రాహుల్ రామకృష్ణ స్పందించారు.

ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ ఈ పోస్ట్ పై స్పందిస్తూ నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్డ్ వర్క్ తో పాటు మంచి నటుడు. ఆయనతో నన్ను మీరు పోల్చడం అంటే నిజంగానే తనని అవమానపరిచినట్లేనని తెలిపారు. తను గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. ఇలా నన్ను తనతో పోల్చడం మీ పిరికితనమే అనిపిస్తుంది .నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.

Rahul Ramakrishns: ప్రియదర్శి గొప్ప నటుడు…


ఇక కమెడియన్ ప్రియదర్శి పలు సినిమాలలో హీరోగా కూడా నటించారు. ఈ క్రమంలోనే బలగం సినిమా ద్వారా ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసింది.