Rajamouli -Prashanth Neel: ఈ టాలీవుడ్ హీరో అంటే ఆ ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకు అంత ఇష్టమా?

0
38

Rajamouli -Prashanth Neel: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ రాజమౌళి ఒకరు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా గుర్తింపు పొందినటువంటి ఈయన బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందారు.

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఈ ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఓకే తెలుగు హీరో అంటే ఇష్టం అని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లను మెప్పించిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే…

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాజమౌళినీ మెప్పించిన ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈ ఇద్దరు హీరోలకు ఎంతో ఇష్టమని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో రాజమౌళికి ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పాల్సిన పని లేదు. కాంబినేషన్లో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఐదు సెన్సేషనల్ హిట్ అందుకున్నాయి.

Rajamouli -Prashanth Neel: పాన్ ఇండియా డైరెక్టర్లను మెప్పించిన తారక్…

ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయకపోయినా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అనే విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.