Ramcharan: ఆ విషయంలో ఉపాసనను చాలా బాధపెట్టిన రామ్ చరణ్… అసలేం జరిగిందంటే?

0
198

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్ పనులకు విరామం ప్రకటించారు. పెళ్లైన పది సంవత్సరాలకు తన భార్య గర్భం దాల్చారు దీంతో రాంచరణ్ నిత్యం ఉపాసనకు తోడుగా ఉంటూ భర్తగా తన బాధ్యతలను నిర్వర్తించారు. అయితే ఉపాసన డెలివరీ తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తనకు రామ్ చరణ్ అవసరం చాలా ఉంటుందని భావించి సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఉపాసన గత నెల 20 వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఉపాసన కూతురికి జన్మనిచ్చిన అనంతరం రామ్ చరణ్ ఇంటిపట్టునే ఉంటూ తన కూతురు భార్య బాగోగులు చూసుకుంటూ తండ్రిగా భర్తగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. అయితే ఓ విషయంలో మాత్రం రామ్ చరణ్ ఉపాసన చాలా బాధ పెట్టారని తెలుస్తుంది.

ఇన్ని రోజులు షూటింగ్ మానుకొని తనభార్య కోసం ఎంతో విలువైన సమయాన్ని కేటాయించిన రామ్ చరణ్ తిరిగి సినిమా షూటింగ్ పనులలో జాయిన్ కావడంతో ఉపాసన ఎంతో బాధపడ్డారట. మరి కొద్ది రోజులు చరణ్ తనకు అండగా ఉంటే బాగుండేదని ఉపాసన ఈ విషయంలో చాలా బాధపడ్డారని తెలుస్తుంది.

Ramcharan: గేమ్ ఛేంజర్ షూటింగ్ కి చరణ్…


చరణ్ షూటింగ్ పనులకు వెళ్ళగా మరోవైపు చిరంజీవి సురేఖ అమెరికా పర్యటన వెళ్లారు దీంతో ఉపాసన కూతురు పుట్టిన తర్వాత అందరూ తనని వదిలి వెళ్లారని చాలా బాధపడ్డారట. అయితే ఇన్ని రోజులు వాయిదా పడినటువంటి గేమ్ చేంజర్ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించుకున్న నేపథ్యంలో చరణ్ షూటింగ్ పనులకు వెళ్లాల్సి రావడంతోనే ఆయన తన కూతురిని వదిలి వెళ్లారని తెలుస్తోంది.