Samantha: దేవుని దయవల్ల విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకొని పరిస్థితి రాలేదు… సమంత షాకింగ్ కామెంట్స్!

0
46

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. అయితే ఈమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్లలో మాత్రం పాల్గొంటున్నారు. తాజాగా ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో భాగంగా సమంత పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో సమంతా లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ సినిమా తనకు ఎంతో అద్భుతంగా నచ్చిందనీ ముఖ్యంగా పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు మీ అందరితో పాటు తాను కూడా ఒకటవ తేదీ ఈ సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.

ఇక తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుతూ ప్రస్తుతం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానని పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు తిరిగి వస్తాను అంటూ కూడా తన ఆరోగ్యం గురించి తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలో సమంతా మాట్లాడుతూ దేవుడు దయవల్ల తనకు విజయవాడ సెంటర్లో ఇడ్లీ స్టాల్ పెట్టుకునే పరిస్థితి ఇంకా రాలేదని తెలియజేశారు. అయితే ఉన్నఫలంగా సమంత ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి అని ఆరాతీస్తున్నారు.

Samantha: సమంతను విమర్శించారా…


సమంత అనారోగ్యంగా ఉన్న సమయంలో తన గురించి ఎవరైనా ఇలాంటి విమర్శలు చేశారా అందుకే వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలోనే సమంత ఈ వేదికపై తనకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు అంటూ కామెంట్స్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఏది ఏమైనా తన పట్ల విమర్శలు చేస్తున్నటువంటి వారికి ఈ మధ్య కాలంలో సమంత ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.