Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఇzక సమంత ప్రస్తుతం నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పూర్తిగా తెలుగు మీడియాని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పటికీ సమంత మాత్రం తెలుగు మీడియా ముందుకు రావడానికి సంకోచిస్తున్నారు. అయితే ఈమె బాలీవుడ్ మీడియా సమావేశాలలో పాల్గొనడం అలాగే పలు సిరీస్ ల షూటింగ్లకు హాజరు కావడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
ఇలా బాలీవుడ్ మీడియాకు, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ఎందుకు తెలుగు మీడియాకు దూరంగా ఉంటుంది ఉద్దేశపూర్వకంగానే ఈమె తెలుగు మీడియాను దూరం పెడుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే తెలుగు మీడియా ముందుకు సమంత వస్తే తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నిస్తారన్న కారణంతోనే ఈమె తెలుగు మీడియా ముందుకు రావడంలేదని తెలుస్తోంది.

Samantha: ఉద్దేశపూర్వకంగానే తెలుగు మీడియాను దూరం పెడుతున్నారా…
ఇదివరకే యశోద సినిమా ప్రమోషన్లలో కేవలం ఒకరోజు మాత్రమే యాంకర్ సుమతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె కేవలం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సమంత టీం తన వ్యక్తిగత విషయాల గురించి అడగకూడదని ముందుగానే చెప్పారట. అందుకే తన పెళ్లి విడాకుల గురించి ఎక్కడ ప్రస్తావించకుండా కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడుతూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మరి సమంత తెలుగు మీడియా ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.
































