Senior Journalist Bhardwaja : 2029 ఎన్నికలు ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తను ఉన్న ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసిన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణకు కేసును ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ కేసు ఎన్ని రోజులుగా నత్తనడకన సాగుతున్నా ప్రస్తుతం ఒక ఫోన్ కాల్ లీక్ తో కొంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఆయన పలు అంశాలను తెలిపారు.

అవినాష్ రెడ్డి ని విచారించునున్న సిబిఐ…
వైఎస్ వివేకానంద కేసు కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది, నిజానికి నత్త నడకన సాగుతున్న ఈ కేసులో ఇప్పటి వరకు దోషుల ఊసు లేదు. ఇక ప్రస్తుతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. హత్య తరువాత అవినాష్ రెడ్డి జగన్ సతీమణి భారతితో ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ఉండటం అనుమానాలకు రేకేత్తిచ్చింది. భరద్వాజ గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ జగన్ వైపు నుండి అవినాష్ రెడ్డి ఇక ఇటు వివేకానంద రెడ్డి కలిసి అంతకుముందు బెంగళూరులో ఒక సెటిల్మెంట్ చెయడం, అందులో వచ్చిన డబ్బును పంచుకోవడంలో తేడాలు రావడం వల్లే హత్య జరిగిందంటూ అభిప్రాయపడ్డారు. ఇక జగన్ మోహన్ రెడ్డి భార్య వైస్ భారతి సలహా మేరకు కడప ఎంపీ సీటు అవినాష్ కి ఇవ్వాలనుకోవడం కూడా వివేకానంద రెడ్డికి నచ్చలేదు.

పవర్ పాలిటిక్స్ వల్లే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, అయితే కావాలనే ఈ హత్య కేసులో జాప్యం జరిగిందని భరద్వాజ అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకానంద కూతురు సునీత కూడా తనకు ప్రాణహాని ఉందని తన సొంత వారిని నమ్మే స్థితి లేదంటూ చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటూ చెప్పారు. ఇక ఈ కేసును సిబిఐ ద్వారా మోడీ ఉపయోగించుకుంటారంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. జగన్ ను తమ కంట్రోల్ లో పెట్టుకోడానికి మోడీ ఈ కేసును వినియోగించుకుంటారంటూ చెప్పారు.

































