Shanmukh Jaswanth: యూట్యూబర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో వెబ్ సిరీస్ లతోపాటు కవర్ సాంగ్స్ చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టారు.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈయన మరింత పాపులర్ అయ్యారని చెప్పాలి. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకు ముందు ఈయన మరొక యూట్యూబర్ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కంటెస్టెంట్ సిరితో చాలా చనువుగా ఉన్నారు. ఇలా వీరి వ్యవహారం ఎన్నో వివాదాలకు కారణమైందని చెప్పాలి.
అప్పటికే సిరి కూడా శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మరిచిపోయి వీరిద్దరూ చనువుగా వ్యవహరించడంతో వీరి గురించి భారీగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఇక బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునయన షన్నుతో కూడా బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఇలా ఈ ప్రేమలు బ్రేకప్ వ్యవహారంతో కొద్దిరోజుల పాటు వార్తలో నిలిచినటువంటి ఈయన ప్రస్తుతం యధావిధిగా కవర్ సాంగ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Shanmukh Jaswanth: సరదాగా కూర్చున్నాను…
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే షణ్ముఖ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వీల్ చైర్ లో కూర్చుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి అభిమానులు అసలు షన్నుకి ఏమైంది అంటూ కంగారుపడుతూ కామెంట్ చేశారు. అయితే ఈయన ఈ ఫోటోని షేర్ చేస్తూ తనకు ఏం కాలేదని అది తన తాతయ్య వీల్ చైర్ అని సరదాగా తాను కూర్చున్నాను అంటూ చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.