సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే మహిళలకు షాకింగ్ న్యూస్..!!

0
344

ఈ మధ్య కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విసృతంగా వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో తమ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఆ ఫోటోలపై స్నేహితుల, బంధువుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ ఫోటోలను కొందరు పెయిడ్ సెక్స్ సర్వీస్ సైట్లలో ఉపయోగిస్తూ సదరు యువతులు, మహిళలకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఒక మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేసేది. 40 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ మహిళకు ఇద్దరు పిల్లలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కావడంతో తన స్నేహితులలా ఆమె కూడా సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె కొన్ని పోర్న్, డేటింగ్ సైట్లలో తన ఫోటోలు ఉన్నట్టు గుర్తించింది. కొందరు తన ఫోటోలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమెకు అర్థమైంది.

ఆ మహిళ వెంటనే తన స్నేహితుడికి ఈ విషయం గురించి చెప్పి సహాయం చేయమని కోరింది. ఆమె స్నేహితుడు ఆ సైట్లలో ఉన్న నంబర్ కు కాల్ చేయగా అవతలి వ్యక్తి ఫోటోలో ఉన్న మహిళతో లైంగిక సేవలు పొందాలంటే డబ్బు జమ చేయాలని సూచించాడు. మహిళ అతని స్నేహితుని సహాయంతో నోయిడాలోని పోలీస్ స్టేషన్ లో తన ఫోటోలను వైరల్ చేస్తున్న సైట్లపై, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. ఫోటోలను పోర్న్, డేటింగ్ సైట్ల నుంచి తొలగించేలా చర్యలు చేపడతామని చెప్పారు. సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఫోటోలను పోస్ట్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవాళ్లు మినహా ఇతరులు ఫోటోలను చూడకుండా, ఆ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకోకుండా మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here