హోస్ట్ నాగార్జున చేయాల్సిన పనిని చేసిన సిరి తల్లి.. నాగార్జునను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

0
1739

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో కుటుంబ సభ్యులు రావడంతో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి సిరి మదర్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారిగా సిరి తన తల్లిని చూడటంతో పరుగున వెళ్లి తన తల్లిని హత్తుకుని ఎమోషనల్ అయ్యింది.

సిరి మదర్ కూడా సిరిని చూడగానే ఎమోషనల్ అవుతూ ఎంతో అద్భుతంగా ఆడుతున్నావని తన కూతురు పై ప్రశంసలు కురిపించింది.ఇదిలా ఉండగా సిరి గురించి బిగ్ బాస్ హౌస్ లో చెబుతూ కాస్త ఎమోషనల్ అయిన సిరితల్లి అనంతరం సిరికి గట్టిగా బుద్ధి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో సిరి షణ్ముఖ్ ను ముద్దులు పెట్టుకోవడం, తనని హగ్ చేసుకోవడం తనకు నచ్చలేదని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

అయితే ఈ విధంగా వీరిద్దరి వ్యవహారశైలిపై సిరి తల్లి సిరి గట్టిగా బుద్ధి చెప్పింది. కానీ ఈ పని చేయాల్సిన హోస్ట్ నాగార్జున మాత్రం వీరి వ్యవహారశైలి చూస్తూ చూడనట్టు వదిలేశాడు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నాగార్జునను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా సిరి, షణ్ముఖ్ గురించి సిరి తల్లి సిరికి వార్నింగ్ ఇవ్వడంతో మరోసారి నెటిజన్లు నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున చేయలేని పనిని సిరి తల్లి చేసి వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నాగార్జున చేయలేని పనిని సిరి తల్లి చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here