Sitara: స్టార్ డాటర్ సితార నేడు 11వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జులై 20 వ తేదీ సితార పుట్టినరోజు కావడంతో ఈమె తన పుట్టినరోజు వేడుకలను తన స్టేటస్ కి తగ్గట్టు జరుపుకోలేదు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్ గా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొని అందరి మనసును గెలుచుకున్నారు.

సితార చిన్న వయసులోనే ఎంతో గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నారని ఇదివరకే మనకు తెలిసిందే. ఈమె నటించిన మొదటి యాడ్ కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ కోటి రూపాయలు కూడా సితార చారిటీ కోసం ఇవ్వడంతో తన మంచి మనసు ఏంటో అర్థమైంది.
ఇలా కోటి రూపాయలు చారిటీ కోసం విరాళంగా ఇచ్చినటువంటి సితార తన పుట్టినరోజు సందర్భంగా మరో మంచి పని ద్వారా అందరి హృదయాలను గెలుచుకున్నారు.ఇక సితార పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే నమ్రత సితార పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

Sitara: ఫౌండేషన్ లో బర్త్డే సెలబ్రేషన్స్…
సితార మహేష్ బాబు ఫౌండేషన్ లో ఉన్నటువంటి యువతులతో కలిసి ఈమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వారి సమక్షంలో సితార కేక్ కట్ చేసి అందరితో కలిసి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ఆ ఫౌండేషన్ లోని కొంతమంది యువతులకు పాఠశాలకు వెళ్లడం కోసం ఈమె సైకిల్ బహుమతిగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి అభిమానులు సితార మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
🌟 A shining star with a heart of gold! 🎂✨ #SitaraGhattamaneni‘s 11th birthday was a celebration of kindness. 🚲💕 Gifting bicycles to school-going girls 🌈
Happy Birthday, Sitara! 🎂💕@MBfoundationorg #HBDPrincessSitara pic.twitter.com/KRIcvN11kY
— Viswa CM (@ViswaCM1) July 20, 2023