సునీత, ఆమె భర్త మధ్య ఎంత ఏజ్ గ్యాపో తెలుసా?

0
160

తెలుగులో ఎన్నో మధురమైన పాటలు పాడుతూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సింగర్ సునీత తాజాగా రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈమె పెళ్లిపై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరి కొందరు పెళ్లి చేసుకోవడం తప్పేంటి అన్నట్లు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సింగర్ సునీత పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆమె వయసు ఎంత ఉంటుంది? తను పెళ్లి చేసుకున్న వ్యక్తి రామ్ వయస్సు ఎంత ఉంటుందనే ఆలోచన అందరికీ కలిగింది. ఈ వయసులో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం పట్ల ఒక్కొక్కరు ఒక అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.అయితే రెండో పెళ్లి చేసుకున్న వీరి వయసు ఎంత ఉంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సునీత పెళ్లి చేసుకున్న వ్యక్తి రామ్ సూరపనేని డిజిటల్ మ్యాంగో మీడియా కంపెనీకి ఓనర్. ఒక విధంగా చెప్పాలంటే డిజిటల్ మీడియాకు రామ్ ఒక మొగల్ లాంటివాడు. ఇక ఆస్తి విషయంలో రామ్ వందల కోట్లు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే రామ్ తన జీవితంలో ఇది రెండో పెళ్లి అని చెప్పవచ్చు. సునీత ఇద్దరూ కూడా ఈ వయసులో ఒంటరి జీవితంతో గడుపుతున్న నేపథ్యంలో వీరిద్దరూ ఒక్కటై కొత్త జీవితం ప్రారంభించాలని భావించి పెళ్లి వైపు అడుగులు వేశారు.

రామ్ వీరపనేని మే 26, 1974న జన్మించారు. అంటే ఆయన వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. ఇక సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి మధ్య కేవలం ఐదు సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉంది. 1995 గులాబీ చిత్రంలో “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో”అని పాట ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తాను పాడిన పాటకి మంచి స్పందన లభించడంతో వరుస అవకాశాలు వచ్చాయి.ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి తన భర్త నుంచి విడిపోయిన సునీత ప్రస్తుతం తన పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా ఉన్న సునీత ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకున్నారు. సునీత కొడుకు ఆకాష్ ప్రస్తుతం ఢిల్లీలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కూతురు శ్రేయ ఇప్పటికే సినిమాల్లో పాటలు పాడుతూ తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here