Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇలా కృష్ణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే చిత్ర బృందం అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.ఇలా కృష్ణ గారు మరణంతో ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంతోమంది గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈయన కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఆయన ఆస్తిపాస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఆయన స్వతహాగా సంపాదించినది చాలా ఉంది అలాగే విజయనిర్మల వల్ల కూడా ఆయనకు పెద్ద మొత్తంలో ఆస్తులు కలిసి వచ్చాయని తెలిపారు.
ఇకపోతే కృష్ణ గారు కెరియర్ మొదట్లో పద్మాలయ స్టూడియో స్థాపించిన తర్వాత కొన్ని కారణాల వల్ల బ్యాంకు రుణం చేశారు అయితే ఆ బ్యాంకు రుణం చెల్లించకపోవడంతో పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన ఇల్లు ఇతరత ఆస్తులను కూడా వేలం వేశారు. ఇలా వేలం పాటలో ఆస్తులు కోల్పోవాల్సిన సమయంలో రంగంలోకి మహేష్ బాబు దిగారని రామారావు తెలిపారు.

Super Star Krishna: వేలకోట్ల ఆస్తులు
ఈ విధంగా ఈయన ఆస్తులన్నీ వేలం వేసే సమయంలో మహేష్ బాబు గారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి తనకు కొంత సమయం కావాలని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తాను డబ్బు మొత్తం చెల్లిస్తానంటూ ఆ భారాన్నంత తన భుజాన వేసుకున్నారని ఈయన తెలిపారు. అప్పట్లో కృష్ణ గారి ఆస్తులు 15కోట్ల రూపాయలకు వేలం వేశారు అయితే అప్పట్లో ఆయనకు అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేది కాదు అయితే ఇప్పుడు ఆ ఆస్తులు ఆయనకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుపాస్తులను తెచ్చి పెట్టిందని ఈ సందర్భంగా రామారావు తెలిపారు.

































