Supritha: సుప్రీత సురేఖ వాణి కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. సురేఖ వాణి పలు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక పిన్ని అక్క వదిన పాత్రలలో ఎంతో లీనమైన నటించిన సురేఖ వాణి ఒకానొక సమయంలో వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉండేవారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలను కాస్త తగ్గించారని తెలుస్తుంది.

ఈ విధంగా సినిమాలకు దూరమైనటువంటి సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. పొట్టి పొట్టి దుస్తులు ధరించి పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరూ గత కొద్దిరోజులుగా అమెరికా వెకేషన్ లో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే అమెరికా వెకేషన్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి వారి వృత్తిపరమైన జీవితంలో బిజీగా మారిపోయారు.
ఇక జూలై నెలలో తాను నేర్చుకున్న పాఠం ఇదేను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా సుప్రీత ఒక వ్యక్తి కారణంగా మన జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుందని తెలిపారు. మనం ముందుగా చేసుకున్నటువంటి ప్లాన్ సక్రమంగా జరగకపోతే మరొక ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.

Supritha: ప్రతి ఛాలెంజ్ స్వీకరించాల్సిందే..
ఇక మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క ఛాలెంజ్ స్వీకరించాలని ఈమె తెలిపారు.వర్కౌట్ అయితే ఓకే కానీ లేకపోతే మనకు దాని నుంచి ఒక అనుభవం ఎదురవుతుందని తెలిపారు. ఇక ఏదైనా మనకు నచ్చని విషయం కనుక మనకు ఎదురైతే అది నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పండి.అది మనం ఉంటున్నటువంటి ప్రదేశమైనా లేకపోతే మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశమైనా కూడా నచ్చకపోతే దానిని స్వీకరించాల్సిన పని లేదు అనే విషయాలను తాను తెలుసుకున్నానంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.