Varun Sandesh: వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ చిత్రం ద్వారా అందరికీ ఎంతో పరిమితమయ్యారు. హ్యాపీ డేస్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత ఈయనకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.ఈ క్రమంలోనే అడపాదడపా సినిమాల్లో నటించిన వరుణ్ సందేశ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇక ఈయన నటి వితికను వివాహం చేసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కొనసాగిన ఈయన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. తన భార్య వితికతో కలిసి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసినప్పటికీ ఈయనకు బిగ్ బాస్ తర్వాత కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.ఇక తన భార్య వితిక మాత్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే హ్యాపీ డేస్ చిత్రంలో పాల్గొన్న ఇతర నటీనటులతో మీరు కాంటాక్ట్ లో ఉన్నారా తరచు కలుస్తుంటారా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ మాట్లాడుతూ హ్యాపీ డేస్ సినిమాలో చేసిన వారితో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటానని వరుణ్ సందేశ్ తెలిపారు.
షూటింగ్ వరకు మాత్రమే…
ఇక తమన్నా గురించి ప్రశ్నలు ఎదురవగానే తమన్నా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తమన్నా పెద్ద స్టార్ అయ్యాక తనలో చాలా మార్పులు వచ్చాయి. తాను ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు అయితే తనతో పెద్దగా కాంటాక్ట్స్ లేవని.. సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉన్నంతవరకే అందరూ ఒక ఫ్యామిలీ ఇలా ఉండేవాళ్లమని తరువాత ఎవరికి వారు వారి వ్యక్తిగత జీవితంలో బిజీ అయ్యారని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ తెలిపారు.