Tamannah: ఆ సినిమాలో నా నటన నాకే నచ్చలేదు… రిజల్ట్ అప్పుడే తెలిసిపోయింది: తమన్నా?

0
40

Tamannah:టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమె నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించిన ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్న వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ ఇంటర్వ్యూలలో భాగంగా తన సినీ కెరియర్ లోని కొన్ని సినిమాల గురించి ఈమె ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తమన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతితో కలిసి సుర అనే సినిమాలో నటించారు.ఈ సినిమా మ్యూజికల్ గా చాలా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు వినపడుతూనే ఉంటాయి. అయితే కమర్షియల్ గా ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. విజయ్ సినీ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నటువంటి చిత్రం ఇదేనని చెప్పాలి.

Tamannah: నటీనటులుగా అది మా బాధ్యత…


తాజాగా తమన్నా ఈ సినిమా గురించి మాట్లాడుతూ సుర సినిమాలోని పాటలు నాకు చాలా ఇష్టం ఇప్పటికీ ఈ పాటలు అక్కడక్కడ వినపడుతూనే ఉంటాయని తెలిపారు. అయితే ఈ సినిమాలో నా నటన నాకే నచ్చలేదు అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాషూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు సరిగా చిత్రీకరించలేదు అప్పుడే ఈ సినిమా ఫలితం ఏంటో తమకు అర్థమైందని కాకపోతే ఒక సినిమాకి కమిట్ అయిన తర్వాత నటీనటులుగా ఆ సినిమాని పూర్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుందని తెలిపారు.