Thamanna: మిల్క్ బ్యూటీ అనే బిరుదు ఎందుకు ఇచ్చారో ఇప్పటికే అర్థం కాలేదు.. తమన్నా కామెంట్స్ వైరల్!

0
38

Thamanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ఈ మధ్యకాలంలో తన కెరీర్ పై చాలా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ విధంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి మిల్క్ బ్యూటీ అనే పాట విడుదల చేశారు.ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి తమన్న ఇచ్చినటువంటి బిరుదు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తనని అందరూ కూడా మిల్క్ బ్యూటీ అనే బిరుదుతో పిలుస్తారు .అయితే తనకు ఈ బిరుదు ఎందుకు వచ్చిందనే విషయం ఇప్పటివరకు తనకు అర్థం కాలేదని తెలిపారు. అయితే తన రంగు చూసి తనకు ఈ బిరుదు ఇచ్చారు అని తాను అనుకోవడం లేదని తెలుగు ప్రేక్షకులు నాపై ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో నాకు ఈ బిరుదు ఇచ్చారని అనుకుంటున్నాను అని తెలిపారు.

Thamanna: నా రంగు చూసి ఇవ్వలేదు…


ఇకపోతే తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న కూడా ఎప్పటి వరకు ఎవరు కూడా తన బిరుదు గురించి ఒక పాట ఇవ్వలేదు కానీ ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ అంటూ ఒక పాటలో నటించడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఈ సందర్భంగా తమన్నా తనకి ఇచ్చినటువంటి బిరుదు గురించి అలాగే తనపై వచ్చినటువంటి ఈ పాట గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.