స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న హ్యట్రిక్ మూవీ పుష్ప. మొదట ఒకే భాగంగా విడుదల చేయాలనుకున్నా.. నిడివి పెద్దదిగా ఉండటంతో దానిని రెండు భాగాలుగా చేయాలనుకున్నారు. మొదటి భాగాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రనానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సినీ ప్రముఖులు రాజమౌళి, కొరటాల శివతో పాటు మరికొంతమంది సినీ పెద్దలు పాల్గొన్నారు. రెండో భాగం కూడా దాదాపు పూర్తయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ పనులను ఆపు చేశారు. మొదటి పార్ట్ రిజల్ట్ ను బట్టి.. దీని సీక్వెల్ షూటింగ్ ఫిబ్రవరి 2022లో ప్రారంభమవుతుంది.
పుష్ప పార్ట్ 1కి సంబంధించిన ప్రమోషన్‌లను పూర్తి చేసిన తర్వాత సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌పై తన దృష్టిని మరల్చనున్నాడు. ఇప్పటికే ఆ పనులను మొదలు పెట్టేశాడు. అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ కోసం షూట్ చేయాల్సి ఉన్నందున లుక్ మెయింటెన్ చేస్తూనే ఉన్నాడు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అతడు అదే గెటప్ తో కనిపించాడు.అల్లు అర్జున్ తొలిసారిగా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని హిందీలో రికార్డ్ స్క్రీన్‌లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
తక్కువ టిక్కెట్ ధరపై పుష్ప నిర్మాతలు స్పందిస్తూ.. ఈ నిర్ణయం థియేటర్ ఆదాయానికి గండి పడుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని కూడా చెప్పారు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలకు తక్కువ సమయం ఉండటంతో ఏ మాత్రం మిస్టేక్ లేకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ కు రూ.190 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు సెకండ్ పార్ట్ కు అంత ఖర్చు కాదనేది తెలుస్తోంది.

































