దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరమవుతుంది.ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అధికమవడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ , పడకలకొరత ఏర్పడుతోంది. ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణం బారిన పడుతున్నారు. ఈ విధంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే బుధవారంనాటి పలు విచారణ ఈ సందర్భంగా కేంద్రానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేస్తూ నిలదీశారు.పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతుంటే మీరు పరిశ్రమల పట్ల ఆందోళన చెందుతున్నారు. మనుషుల జీవితాలు అంటే ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను గత 24 గంటల్లో ఏం చేశారని ధర్మాసనం డిమాండ్ చేసింది. అసలు ఆక్సిజన్, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్లాన్ ఉందా అంటూ హైకోర్టు నిలదీసింది. ఆస్పత్రులకు కావలసినంత ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యత పూర్తి కేంద్రానిదేనని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వైద్య అవసరాల కోసం పరిశ్రమల నుంచి ఆక్సిజన్ వైద్య రంగం వైపు మళ్ళించాలని పేర్కొంది. దేశం మొత్తం ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఎలాగైనా ఆక్సిజన్ ను కొనుగోలు చేసి లేదా దొంగతనం చేసి అయినా తమ బాధ్యత నెరవేర్చాలని హైకోర్టు స్పష్టం చేసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here