Upasana: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ఈమె మెగా కోడలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా మెగా ఇంటి కోడలుగా మెగా పరువు ప్రతిష్టలలో ఉన్నత శిఖరాలకు చేర్చడమే కాకుండా బిజినెస్ రంగంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఇలా ఉపాసన ఇప్పటికే ఎన్నో వ్యాపారాలను చూసుకుంటూ ఉండగా తాజాగా అత్తమ్మ కిచెన్స్ అంటూ మరి కొత్త బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఉమెన్స్ డే సందర్భంగా ఉపాసన తన అత్తయ్య అమ్మమ్మలతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె అత్తమ్మ కిచెన్స్ గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఉపాసన తన అత్తయ్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ కిచెన్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇలా మెగా ఇంటి రుచులను ప్రతి ఒక్కరు ఆస్వాదించాలన్న ఉద్దేశంతో ఉపాసన ఈ బిజినెస్ ప్రారంభించారు అయితే తాజాగా ఈమె ఈ విషయం గురించి తెలియజేస్తూ 60 సంవత్సరాల వయసులో మా అత్తమ్మ వ్యాపారవేత్తగా కొత్త అవతారం ఎత్తిందని తెలిపారు.
సంపన్న దేశం అవుతుంది…
ఇలా ప్రతి ఒక్క అత్త అమ్మ కూడా వ్యాపారాన్ని మొదలుపెడితే మన దేశం ఎంతో సంపన్న దేశంగా మారుతుంది అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈమె తన అత్తయ్యతో ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ప్రతి ఒక్క అత్త కోడలు ఇలాగ ఉంటే ఎంతో బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

































