YS Sharmila : వైఎస్ షర్మిల రెడ్డి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

“సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిందా?” అంటూ ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏడాది గడిచినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ఆమె నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఏడాది కాలంగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఆమె ఆరోపించారు.
“సూపర్ సిక్స్ పథకాన్ని సూపర్ ఫ్లాప్ ఎందుకు చేశారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి” అని ఆమె డిమాండ్ చేశారు. బాబు గారి ఏడాది పాలన మొత్తం 3D గ్రాఫిక్స్ మాదిరిగా కంటికి మాత్రమే కనిపిస్తోందని, వాస్తవానికి ప్రజలకు ఏమీ అందలేదని ఆమె విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి.



































