Actor Danush: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధనుష్ తాజాగా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకొని ఆ ఇంటిలోకి గృహప్రవేశం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ ఇంటి నిర్మాణం కోసం ధనుష్ దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన్నట్లు సమాచారం. ఇలా అన్ని హంగులతో అత్యంత విలాసవంతమైన ఈ ఇంటిని ధనుష్ నిర్మించడానికి ఓ బలమైన కారణం ఉందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

ధనుష్ ఇంత ఖరీదైన ఇంటిని నిర్మించడానికి గల కారణం కేవలం రజినీకాంత్ తో తనకు ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలే కారణమని తెలుస్తోంది. గతంలో పోయిస్ గార్డెన్ లో ఉన్నటువంటి రజినీకాంత్ ఇంట్లో ధనుష్ తల్లిదండ్రులను అవమానించారట. అయితే ఈ అవమానం తట్టుకోలేక రజినీకాంత్ ఇంటికి పక్కనే ధనుష్ ఇలా ఖరీదైన భవనాన్ని నిర్మించి తన తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారనే వార్త వైరల్ అవుతుంది.
అయితే ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్టు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అయితే ధనుష్ ఇంటి నిర్మాణం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆయన కొట్టి పారేశారు.ఈ ఇంటి నిర్మాణం ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకోక ముందే చేపట్టారు. ఇద్దరు ఈ ఇంట్లో తమ పిల్లలతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాలు కూడా చేశారు.

Actor Danush:అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే…
దురదృష్టవశాత్తు ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోవడంతో ధనుష్ సైతం ఆ ఇంటిలో నివసించకుండా ఆ ఇంటిని తన తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారు. అయితే రజనీకాంత్ పై ద్వేషంతోనే ఈ ఇల్లు నిర్మించారనీ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనంటూ సీనియర్ జర్నలిస్ట్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు
மனிதன் என்பவன்
தெய்வம் ஆகலாம்..நன்றி சார்..????????????
2023’s Best Moment ❤️ Thank you @dhanushkraja #SIR !! #Mahashivratri special time with #Dhanush sir❤️???? ???? #vaathi pic.twitter.com/Um51eFa3iw
— B.RAJA (@B_RajaAIDFC) February 20, 2023































