వైఎస్ జగన్ సర్కార్ కరోనా సంక్షోభ సమయంలోనూ.. సంక్షేమం పథకాలను కొనసాగిస్తోంది. మంగళవారం మరో కీలక పథకానికి నిధులను విడుదల చేయనుంది. చేనేతకు అసరగా నిలిచే ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకంలోని మూడవ విడత నిధులను విడుదల చేయనుంది. మూడో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 80,032 మంది నేతన్నలకు రూ. 192.08 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రతి చేనేత కార్మికుడికి ఖాతాకు రూ. 24 వేలు అందించనున్నారు.

ఇక ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 383.99 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం… మంగళవారం విడుదల చేసే రూ. 192.08 కోట్లతో కలిపి రూ.576.07 కోట్ల వరకు నేతన్నలకు అందించనున్నారు.



































