Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన భార్య వసుంధరతో కలిసి అమెరికా వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా తన భార్యతో కలిసి అమెరికాలో పలు ప్రాంతాలకు పర్యటించడమే కాకుండా పలు కార్యక్రమాలకు కూడా ఈయన హాజరవుతున్నారు అయితే తాజాగా బాలయ్యకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో భాగంగా ఓ యువతి బాలకృష్ణ వసుంధర సమక్షంలో కేక్ కట్ చేసి బర్తడే జరుపుకున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ దంపతుల పాదాలకు నమస్కారం చేసి వారి చేత ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అసలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరా అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే తప్పకుండా ఈమె తమ బంధువుల అమ్మాయి అయి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు కానీ నిజమా అది కాదు ఈమె ఒక సాధారణ బాలకృష్ణ అభిమాని మాత్రమే. ఈ ఒక్క ఫోటో చాలు బాలయ్య అభిమానులు అంటే ఎంత ప్రేమ చూపిస్తారో అనడానికి.

Balakrishna:అభిమాని పుట్టినరోజు జరిపిన బాలయ్య…
అమెరికాలో ఉన్నటువంటి ఓ బాలయ్య అభిమాని బాలకృష్ణ సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒక సాధారణ అభిమానికి బాలయ్య పుట్టినరోజు సెలబ్రేట్ చేయడంతో బాలయ్య మంచి మనసు పట్ల ఆయన అభిమానులపై చూపించే ప్రేమ పట్ల అభిమానులు ఫీదా అవుతున్నారు. ఈ అరుదైన దృశ్యం యూఎస్ లోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది.
A Lady Fan Celebrated her birthday with our Legend #Balayya and Vasundhara garu at Philadelphia US#jyosribollineni #anganwadiwing pic.twitter.com/GkViaiSdzu
— jyothi bollineni(B+ve Blood Group) (@JyothiBollineni) July 10, 2023