Chiranjeevi: చిరంజీవి అమెరికా వెళ్ళినది సర్జరీ కోసమేనా… అసలేం జరిగిందంటే?

0
119

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితన భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.చిరంజీవి నటిస్తున్నటువంటి భోళాశంకర్ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడంతో ఈయన వెకేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇలా కొన్ని రోజులపాటు అమెరికాలోనే ఉన్నటువంటి చిరంజీవి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ విధంగా చిరంజీవి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తరుణంలో ఈయనకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగాస్టార్ చిరంజీవి అమెరికా వెళ్ళినది వెకేషన్ కోసం కాదని సర్జరీ కోసం అమెరికా వెళ్లారు అంటూ ఓ వార్త సంచలనగా మారింది దీంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్జరీ కోసం చిరంజీవి అమెరికా వెళ్లడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కాలికి మైనర్ సర్జరీ చేయించుకున్నారని సమాచారం అయితే ఈ సర్జరీ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సర్జరీ చాలా చిన్నదని తెలుస్తోంది.నిజానికి ఈయన తన భార్యతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్లారు పనిలో పనిగా అక్కడ సర్జరీ చేయించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Chiranjeevi: చిరు కాలికి సర్జరీ…


ఇక చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ కానున్నారు. ఈ సినిమా విడుదలైన అనంతరం చిరంజీవి కళ్యాణకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు. ఇక కాలు నొప్పి చేయడంతో ఈ నొప్పి నుంచి విముక్తి పొందడం కోసమే చిరంజీవి చిన్న సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తుంది.