కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతోంది. ప్రజలు కరోనా వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నారు. కరోనా విజృంభణ తరువాత దేశంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఒక్కో సవాల్ ను అధిగమిస్తూ వచ్చింది. మొదట భారత్ పీపీఈ కిట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడగా ప్రస్తుతం మన దేశం నుంచి ఇతర దేశాలకు పీపీఈ కిట్లు ఎగుమతి అవుతున్నాయి.
కరోనా వైరస్ నియంత్రణకు మోదీ సర్కార్ కొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తోంది. శాస్త్రవేత్తలు గతంలోనే కుక్కల ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చని తేల్చగా తాజాగా చేసిన ప్రయోగాల్లో కుక్కలు నూటికి నూరు శాతం కచ్చితత్వంతో వైరస్ ను గుర్తించగలుగుతాయని తేలింది. శాస్త్రవేత్తలు కుక్కలకు ఉన్న ఘ్రాణశక్తి వైరస్ ను గుర్తించడంలో సహాయపడుతుందని తెలుపుతున్నారు. శునక శిక్షకులు కుక్కలు వైరస్ ను గుర్తించడంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నట్టు వెల్లడిస్తున్నారు.
రద్దీ ప్రదేశాల్లో కుక్కల సహాయంలో సులువుగా కరోనా వైరస్ సోకిన వాళ్లను గుర్తించడం సాధ్యమవుతుంది. కరోనా వైరస్ ను వేగంగా గుర్తించడం వల్ల వైరస్ ను అదుపు చేయవచ్చు. ఇంటర్నేషనల్ కె9 బృందం చేసిన అధ్యయనంలో కుక్కలు వైరస్ ను గుర్తిస్తాయని ఖచ్చితంగా నమ్మవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శిక్షకులు మొదట చెమట, నడక ఆధారంగా వైరస్ ను గుర్తించేలా కుక్కలకు శిక్షణనిచ్చారు.
లెబనాన్, ఫిన్లాండ్ లలో ఇప్పటికే ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కల ద్వారా వైరస్ ను గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కుక్కలు గుర్తించిన వారికి కరోనా పరీక్షలు చేయగా 92 శాతం మందికి కరోనా నిర్ధారించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.