సినిమా ఇండస్ట్రీలో తెర వెనుక చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి..కానీ అవి సినిమా వాళ్లకు మాత్రమే తెలుస్తాయి..కొన్ని సంఘటనల గురించి మనం విన్నప్పుడు ఆశ్చర్య పోతుంటాం.. అయితే అలాంటి సంఘటనలకు చాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటివి సర్వసాధారణం. స్టార్ హీరోలకు నచ్చిన హీరోయిన్లను ప్రమోట్ చేయడం, నచ్చని హీరోయిన్లను అవాయిడ్ చేయడం అనేది సినిమా పుట్టినప్పటి నుండి ఉంది.

నిజం మాట్లాడుకుంటే ఒక్క హీరోయిన్ల విషయంలోనే కాదు, ఇతర నటులు, నటీమణుల విషయంలోనూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఆయన సీనియర్ హీరో, ప్లాప్ ల వలయంలో చిక్కుకునిపోయి గత నాలుగేళ్లుగా హిట్ లేక పడిగాపులు కాసి.. మొత్తానికి లాస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ముప్పై ఐదేళ్లకు హీరో అయి.. వరుస హిట్స్ అందుకుని.. ఇప్పటికీ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఆయనకు సినిమా రంగంలో చాలామంది హీరోయిన్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందులో ఒక యంగ్ హీరోయిన్ అంటే ఈయన ప్రత్యేక అభిమానం చుపిస్తున్నాడట. ఇప్పుడు తానూ చేస్తోన్న సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు. అలాగే తనకు సన్నిహితుడు అయినా ఒక యంగ్ హీరో చేస్తోన్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో కూడా ఆమెను హీరోయిన్ ను పెట్టుకోండి అంటూ ఆ హీరోగారు మేకర్స్ పై తెగ వత్తిడి తెచ్చారట.

మాంచి ఫిజిక్ తో, మత్తెక్కించే కళ్లతో, కవ్వించే విధంగా చిట్టి పొట్టి నిక్కర్లతో ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే ఆ హీరోయిన్ను పెట్టుకుంటే.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాస్త, హాట్ బ్యూటీ మసాలా స్టోరీ అయిపోతుందని ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ చెప్పుకుని తెగ ఫీల్ అవుతుంది. మరోపక్క ఆమెను ఎలాగైనా ఆ సినిమాలో హీరోయిన్ గా పెట్టించాలని ఆ హీరోగారు తెగ ప్రయత్నిస్తున్నారట.. మరి ఆ హీరోయిన్ కోసం ఆ హీరోగారి రికమెండేషన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here