Kaikala Satyanarayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నవంబర్ నెలలో కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం మనకు తెలిసిందే.

ఇలా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కైకాల ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అనారోగ్య సమస్య చేసినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సహాయం అందించి తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడంతో కైకాల సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేయడమే కాకుండా తన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మీ సహాయం నా కుటుంబానికి శక్తినిచ్చింది..
అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైనప్పుడు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా వ్యక్తిగతంగా నన్ను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నాకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు చెప్పిన విధంగానే ఉన్నతాధికారులు నన్ను సంప్రదించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీరు చేసిన సహాయం నాకు నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని, కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న గౌరవం, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే రాష్ట్రం మంచి చేతులలో ఉందనే భరోసా వస్తుందని కైకాల పేర్కొన్నారు.

































