బుల్లి తెర నటుడు పరిటాల నిరుపమ్ అంటే అందరూ ఆలోచిస్తారేమో కానీ…డాక్టర్ బాబు అంటే టక్కున అందరికీ గుర్తుకు వస్తాడు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ సీరియల్ లో కార్తీక పాత్ర కన్నా… డాక్టర్ బాబు గానే ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్ డాక్టర్ బాబు పాత్రలో నటించే
నిరుపమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పవచ్చు.

కెరియర్ మొదట్లో వెండితెర విలన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వెండితెరపై సరైన అవకాశాలు రావడంతో బుల్లితెరవైపు అడుగులు వేసి బుల్లితెర శోభన్ బాబు పేరు సంపాదించుకున్నారు. చంద్రముఖి కార్తీకదీపం సీరియల్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిరుపమ్ నిర్మాతగా మారి హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ చేస్తున్నారు.
కార్తీక్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.కేవలం సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం డాక్టర్ బాబుకు అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఓసారి కమెడియన్ బ్రహ్మానందం గారు డాక్టర్ బాబుకి ఫోన్ చేసి మరి మీ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించడం అందుకు నిదర్శనమని చెప్పవచ్చు.
ఇక వెండితెరపై ఎంతో మంది హీరోలు ఉండగా.. మెగాస్టార్ తల్లి అంజనాదేవి సైతం డాక్టర్ బాబు యాక్షన్ కు ఫిదా అయ్యారు. అంజనాదేవి కూడా డాక్టర్ బాబుకు పెద్ద అభిమానిన. ఈ క్రమంలోనే తన అభిమానాన్ని అంజనాదేవి ఎంతో ప్రత్యేకంగా తెలియజేస్తారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అంజనా దేవి గారు మామిడి పండ్లను పంపిస్తారని.. తనని కొడుకుల చూసుకుంటారని డాక్టర్ బాబు తెలియజేశారు.

































