ఆ దర్శకుడితో మళ్లీ రచ్చ చేసిన మంచు లక్ష్మి…!

0
226

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న కథలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పిట్టకథలు సినిమా తెరకెక్కింది. ఇందులో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించారు. అయితే మరోసారి ఈ దర్శకుడితో కలిసి లక్ష్మీ మంచు రచ్చ చేశారు. అయితే ఈసారి సినిమా కోసం కాదు.. వంట చేయడం కోసం వీరిద్దరూ మరోసారి కలిశారు.

మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా “ఆహా” యాప్ ద్వారా ప్రసారమవుతున్న “ఆహా భోజనంబు”అనే కార్యక్రమం ద్వారా మంచులక్ష్మి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై వివిధ రకాల వంటలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ , అదేవిధంగా రెండవ ఎపిసోడ్ కు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ఎంతో సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమం మూడవ ఎపిసోడ్ లో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ మళ్లీ మేమిద్దరం కలిసాము.. అయితే వంట చేయడానికి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోగ్రామోలో భాగంగా మంచు లక్ష్మి తరుణ్ భాస్కర్ ఎంతో సరదాగా ముచ్చటిస్తూ వంటలను వండారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ చక్కెర పొంగలి, టమోటా చారు ఏ విధంగా తయారు చేయాలో చూపించారు. వీరిద్దరి మధ్య ఎంతో సరదాగా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 6వ తేదీన ఆహా యాప్ లో ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి అఖిల్, విష్ణు, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా రానున్నట్లు సమాచారం.