Manchu Lakshmi: అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మంచు లక్ష్మి… ఏం చెప్పారో తెలుసా?

0
301

Manchu Lakshmi: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటిది వారి మధ్య జరిగే గొడవలు ఇక సోషల్ మీడియాలో సంచలనంగా మారుతాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మంచి ఫ్యామిలీలో నిన్న జరిగిన గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారధి పై దాడి చేయడమే కాకుండా మనోజ్ పై కూడా దాడికి ప్రయత్నించారు. అయితే ఈ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా బంధువుల ఇళ్లకు వచ్చి కూడా కొడుతుంటారు అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. అయితే ఈ వీడియో పై మోహన్ బాబు గారు స్పందించడంతో వెంటనే మనోజ్ వీడియో డిలీట్ చేశారని తెలుస్తుంది.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు మనోజ్ విష్ణు మధ్య గొడవలకు కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.ఇక ఈ గొడవ గురించి మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Manchu Lakshmi: గొడవ గురించి నాకు తెలియదు…

నాకు ఈ గొడవ గురించి అసలు ఏ మాత్రం తెలియదు ఈ రోజు మా ఇంట్లో లంచ్ ప్రోగ్రాం ఉంది. నేను ఆ పనిలో బిజీగా ఉన్నాను ఆ విషయం గురించి పూర్తిగా తెలియకుండా నేను ఏమీ మాట్లాడను అంటూ మంచు లక్ష్మి మనోజ్, విష్ణు గొడవ గురించి స్పందిస్తూ ఇలా బదులిచ్చారు. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.