Pawan Kalyan: ఇంస్టాగ్రామ్ లో పవన్ కు అభిమానులుగా మారిపోయిన స్టార్ హీరోయిన్స్… ఎవరో తెలుసా?

0
58

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలోను మరోవైపు రాజకీయ నాయకుడిగా రాజకీయాలలోనూ ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన తన రాజకీయ విషయాలను అభిమానులతో పంచుకోవడం కోసం ఇదివరకు ట్విట్టర్ ఉపయోగిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టారు.

జూలై 4వ తేదీన ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో.. జైహింద్ అంటూ ఒక బయోతో తన ఇన్ స్టా ఖాతాను ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే ఈయన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నిమిషం నిమిషానికి ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతూ వచ్చింది కేవలం 6 గంటల వ్యవధిలోని ఒక మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.

ప్రస్తుతం ఈయనకు 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అది కూడా ఒక్క పోస్ట్ కూడా చేయకుండా ఈ స్థాయిలో ఫాలోవర్స్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రెటీలు కూడా పవన్ కళ్యాణ్ ను తమ ఫేవరెట్ హీరోగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా పవన్ కళ్యాణ్ ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

Pawan Kalyan:ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న హీరోయిన్స్…


ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ సరసన నటించినటువంటి శృతిహాసన్ కీర్తి సురేష్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ అంటే వారికి ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేశారు. ఇక ఈ ముగ్గురు హీరోలు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ స్టార్ హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ ను ఫాలో కావడంతో పవన్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.