‘రానా’ టాటూ వెనక అంత పెద్ద సీక్రెట్ ఉందా..??

0
92

మన సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా అది ఫ్యాషనే..ముఖ్యంగా చాలామంది సెలెబ్రిటీలు తమ ఒంటిపై టాటూస్ వేయించుకుంటుంటారు.. అది కూడా ఒక ఫ్యాషన్ అని ఫీలవుతుంటారు వాళ్లు.. హీరోల్లో కొంతమంది మాత్రమే దీన్ని ఫాలో అయితే.. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్స్ మాత్రం పర్మినెంట్ టాటూలు వేయించుకుంటారు. త్రిష, నయనతార, సమంతా, రష్మిక ఒకరేమిటీ చాలా మంది నటీమణు తమ ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు.

పలువురు హీరోలు సైతం తమకు నచ్చిన టాటూలు వేయించుకున్నారు. నాగార్జున భుజంపై పెద్ద చక్రం టాటూ ఉంటుంది. రానా కూడా ఒంటిపై ఓ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. కాకపోతే ఆ టాటూ ఎక్కడ వేసుకున్నాడు? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి అనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. ఆ పచ్చబొట్టు లేకపోతే బాగుండు అని తాజాగా ఆయన వెల్లడించాడు.రీసెంట్ గా రానా హోస్ట్ చేస్తున్న ఓ షోకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మోహన్ బాబు ముద్దుల బిడ్డ కలిసి వచ్చారు.

కాసేపు షోలో ఫన్నీ ముచ్చట్లు పెట్టారు. ఒకరిపై మరొకరు క్వశ్చన్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టాటూ వేసుకోవాలని అనుకంటే ఎవరిది వేసుకుంటావని రానాను అడిగారు.దీనికి రానా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. ఎవరి పేరును వేయించుకుంటాను అనే విషయం పక్కనపెడితే.. ముందుగా తన ఒంటిపై ఉన్న టాటూ డిజైన్ మార్చుకోవాలని ఉందన్నాడు. అది తనను బాగా ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పాడు.

ఇక ఎవరి పేరో వేయించుకోవడం కంటే తన పేరునే తన ఒంటిపై పచ్చబొట్టుగా వేయించుకుంటానని చెప్పాడు. దాని వలన ఎవరికి ఎలాంటి అనుమానం కలుగదని చెప్పాడు. పైగా తన పేరుతో తన తాత పేరు కూడా ఉందన్నాడు.అయితే.. ఇప్పటికే తన ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ ఏంటి అనేది మాత్రం రానా చెప్పలేదు. కానీ నెటిజన్లు ఆ టాటూ గురించి వెతికే పనిలోపడ్డారు. రానా డేటింగ్ చేసిన ఏ హీరోయిన్ పేరో అయి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here