Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు ఒక ఏడాది పాటు విరామం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత మయో సైటిసిస్ చికిత్స కోసం అమెరికా వెళుతున్నారు. ఇలా అమెరికా వెళుతున్నటువంటి సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సమంత ఈ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళుతున్నారని అయితే చికిత్స కోసం ఈమె ఒకసారి హీరో వద్ద ఏకంగా 25 కోట్ల రూపాయల అప్పు చేశారు అంటూ ఓ వార్త ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వార్తలు సమంత దృష్టికి వెళ్లడంతో సమంత కూడా ఈ వార్తలపై ఘాటుగా స్పందించి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ మయోసైటీస్ కోసం 25 కోట్లా ఈ డీల్ ఏ మాత్రం బాగాలేదు. అయితే ఈ చికిత్స కోసం చాలా తక్కువ అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉందని తెలిపారు.ఇక తాను ఇన్ని రోజులు సినిమాలలో పని చేసినందుకు నాకు రెమ్యూనరేషన్ గా రాళ్లు రప్పలు ఇవ్వలేదని ఈమె మండిపడ్డారు. నా గురించి నేను సులభంగా జాగ్రత్తలు తీసుకోగలనని తెలిపారు.

Samantha: వేల మంది బాధపడుతున్నారు..
ఇలా ఈ వ్యాధి చాలా ఖరీదైన ట్రీట్మెంట్ తో కూడుకున్నదని వార్తలు రావడంతో ఈమె మండిపడ్డారు.ఈ వ్యాధి కారణంగా కొన్ని వేల మంది బాధపడుతున్నారు. ఇలా అసత్యపు వార్తలను ప్రచారం చేయడం వల్ల వారు భయాందోళనకు గురవుతారు కనుక ఈ వ్యాధి పట్ల అందరూ కాస్త బాధ్యతగా వ్యవహరించండి అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా అసత్యపు వార్తలపై స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.