Tamannah: డైమండ్ రింగ్ వార్తలపై స్పందించిన తమన్నా… అదసలు డైమండ్ రింగే కాదంటూ కామెంట్స్!

0
74

Tamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నకు మెగా కోడలు ఉపాసన ఒక డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.తమన్నా నటనకు ఫిదా అయినటువంటి ఉపాసన తనకు ఎంతో విలువైనటువంటి డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇక ఈ డైమండ్ రింగ్ ప్రపంచంలోనే ఐదవ పెద్ద డైమండ్ అని కూడా తెలిపారు అంతేకాకుండా ఈ డైమండ్ విలువ రెండు కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఈ విధంగా తమన్న కోసం ఉపాసన ఇచ్చినటువంటి రింగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు చివరికి తమన్న వరకు చేరడంతో ఈ వార్తలపై తమన్న స్పందించి అసలు విషయం తెలియజేశారు.ఉపాసన తనకు డైమండ్ రింగ్ ఇచ్చారంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తనకు ఎటువంటి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వలేదని తమన్నా వెల్లడించారు.

ఇకపోతే తన చేతికి డైమండ్ రింగ్ ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి నిజానికి అది డైమండ్ రింగ్ కాదని ఈమె తెలియజేశారు. చేతి వేలికి సోడా బాటిల్ ఓపెనర్ పెట్టుకోవడంతో చాలా బాగా అనిపించింది. అందుకే ఆ ఓపెనర్ తో కొన్ని ఫోటోలు దిగానని ఈ సందర్భంగా తమన్నా వెల్లడించారు. ఇలా తన చేతికి ఉన్నది డైమండ్ రింగ్ కాదు సోడా బాటిల్ ఓపెనర్ అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tamannah: సోడా బాటిల్ ఓపెనర్…


ఇలా తనకు మెగా కోడలు ఉపాసన డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించి తమన్న క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తల పట్ల తమన్నా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా పులిస్టాప్ పడిందని తెలుస్తుంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జైలర్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.