Tarakaratna: ఇంకా భర్త జ్ఞాపకాలలోనే అలేఖ్య రెడ్డి… తండ్రి కొడుకుల ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్!

0
43

Tarakaratna: నందమూరి తారక రత్న నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనకు తెలిసిందే. ఇలా గుండెపోటుకి గురైనటువంటి ఈయన బెంగుళూరు నారాయణ హృదయాలయాలో దాదాపు 23 రోజుల పాటు మృత్యులతో పోరాడి చివరికి మృత్యువు కౌగిలిలో బందీ అయ్యారు. ఈ విధంగా ఫిబ్రవరి 18వ తేదీ తారకరత్న మరణించారు. తారకరత్న మరణించి దాదాపు 6 నెలలు అవుతుంది.

ఈ విధంగా తారకరత్న మరణించి ఇన్ని నెలలు అవుతున్నప్పటికీ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మాత్రం తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. తన భర్తను తలుచుకుంటూ తనతో గడిపిన ఆ క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా తారకరత్న గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇందులో తారకరత్న ఫోటోతో పాటు తన కుమారుడు తనయ్ రామ్ ఫోటోని కూడా షేర్ చేశారు. తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమా లుక్ కి సంబంధించిన ఫోటోతో పాటు ప్రస్తుతం తన కుమారుడు తనయ్ రామ్ ఫోటోని కూడా ఈమె షేర్ చేస్తూ లైక్ ఫాదర్ లైక్ సన్ అంటూ కామెంట్ చేశారు.

Tarakaratna: ఎమోషనల్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్…


ఇలా ఈ ఫోటోలలో తారకరత్న తనయ్ రామ్ ఇద్దరు ఒకే పోలికలతో ఉండడంతో ఈ ఫోటో చూసినటువంటి నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిస్ యు సో మచ్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.