Thamannah: టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్న… అసలేమన్నారో తెలుసా?

0
39

Thamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడటం వల్ల ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం తమన్న ఎంతో బిజీగా మారిపోయారు.

తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈసినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైపర్ ఆది చేసిన ఇంటర్వ్యూలో చిత్ర బృందం పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా హైపర్ ఆది తమన్నాను ప్రశ్నిస్తూ…టాలీవుడ్ హీరోల గురించి ఒక్కమాటలో సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నించారు. అయితే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోలతో కలిసి సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తమన్న టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ చిరంజీవి చాలా యూనిక్, అల్లు అర్జున్ స్టైలిష్ పర్సన్.

Thamannah: టాలీవుడ్ హీరోలపై తమన్న ప్రశంసలు..


మహేష్ బాబు చాలా అందగాడు, ఎన్టీఆర్ ఆల్ రౌండర్. పవన్ కళ్యాణ్ వెరీ మాస్ హీరో,ప్రభాస్ అందరి డార్లింగ్ అంటూ ఈమె టాలీవుడ్ హీరోల గురించి ఒక్కమాటలో చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమన్నా ఇలా అందరి హీరోల సరసన సందడి చేశారు.ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.