Tollywood Anchors: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ల పేర్లు చెప్పమంటే వెంటనే సుమ, అనసూయ ,రష్మీ, శ్రీముఖి, ప్రదీప్, రవి ఇలా వరుసగా అందరి పేర్లు టకటక చెప్పేస్తాము.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమా కార్యక్రమాలు టీవీ షోలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న యాంకర్లు సైతం నేటితరం యాంకర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా కొనసాగుతున్నటువంటి వీళ్ళు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…

సుమ: దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సుమ వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు. సుమ షెడ్యూల్ చూసుకొని సినిమా ఈవెంట్లు నిర్వహించుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.ఇక సుమ ఒక్కో ఈవెంట్ కు సుమారు మూడున్నర లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
ప్రదీప్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన కూడా ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షో కి ప్రదీప్ రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
అనసూయ:జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వెండి తెర సినిమాలతో బిజీగా ఉన్నారు.
రష్మీ:జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మీ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
శ్రీముఖి: ప్రస్తుతం బుల్లితెరపై శ్రీముఖి హవ కొనసాగుతుంది ఏ టీవీ ఛానల్ లోకి వెళ్లిన శ్రీముఖి కార్యక్రమం ఏదో ఒకటి ప్రసారమవుతోంది.ఇక శ్రీముఖి కూడా ఒక్కో ఈవెంట్ కి సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
రవి: ప్రదీప్ తర్వాత మేల్ యాంకర్ గా గుర్తింపు పొందిన రవి ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Tollywood Anchors:
శ్యామల: యాంకర్ శ్యామల సైతం యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కి సుమారు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీరితోపాటు యాంకర్ వర్షిని మంజూష వంటి వాళ్ళు ఒక్కో ఎపిసోడ్ 50 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

































