Varun Tej Wedding: పెళ్లి గురించి క్లారిటీ చేసిన వరుణ్ తేజ్…. పెళ్లి జరిగేది అప్పుడే అంటూ?

0
56

Varun Tej Wedding: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.అయితే వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.వీరి వివాహం ఈనెల చివరన ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పటివరకు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. తాజాగా తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఇంకా తమ పెళ్లి తేది ఫిక్స్ కాలేదని ఈయన తెలిపారు. తన పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉండవచ్చని ఈయన తెలియజేశారు.

ఇకపోతే తమ పెళ్లి తేదీని ఫిక్స్ చేసేది మా అమ్మగా రేనని ఆ బాధ్యత మొత్తం అమ్మే తీసుకుంది అంటూ వరుణ్ తేజ్ వెల్లడించారు.తన పెళ్లి ఘనంగా కాకుండా చాలా సింపుల్ గా చేసుకోవాలని అనుకుంటున్నాను అయితే సింపుల్ గా హైదరాబాదులో చేసుకోవడానికి కుదరదు కనుక తాము డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశామని తెలిపారు.

Varun Tej Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్న…


ఇప్పటికే తమ పెళ్లి ఎక్కడ జరగాలి అనే విషయం గురించి ఇండియాలో మూడు ప్లేసులను సెలెక్ట్ చేసామని అలాగే ఫారిన్ లో కూడా రెండు ప్లేసులను సెలెక్ట్ చేసామని తెలిపారు. అయితే ఈ పెళ్లి తేదీ ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి వేదిక ఎక్కడ అనే విషయాలన్నింటినీ కూడా అధికారికంగా తెలియజేస్తాము అంటూ వరుణ్ తేజ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.